prathighatana.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 4:03 pm Digital Edition : PRATHI GHATANA

లట్టుపల్లి పీ.హెచ్.సీ లో బాలికలకు హెచ్.పీ.వీ టీకాల పంపిణీ

లట్టుపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టీ. ప్రసన్న

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాలను అర్హులైన బాలికలకు బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 14 మందికి పంపిణీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ టీ. ప్రసన్న తెలిపారు. వైద్యాధికారి మాట్లాడుతూ.. 2011 ఏప్రిల్ ఒకటి నుండి 2012 మార్చి 31 వరకు జన్మించిన బాలికలందరూ తప్పని సరిగా గర్భాశయ క్యాన్సర్ రోగ నిరోధక శక్తి కొరకు ప్రభుత్వం సరఫరా చేసిన హెచ్.పీ.వీ టీకాలు వేసుకోవాలని ఆమె సూచించారు. ఆరోగ్య వారోత్సవాల 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ టీకాలు ప్రత్యేకంగా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మేఘనా రెడ్డి, నర్సింగ్ అధికారి స్వరూప రాణి, పర్యవేక్షకులు బాలమణి, మహిళ ఆరోగ్య కార్యకర్తలు వరలక్ష్మి, జ్యోతి, విజయలక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.