prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 2:39 pm Digital Edition : PRATHI GHATANA

రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతిఘటన బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్

మండలంలోని తుక్కపురం గ్రామం నుండి గౌస్ నగర్ వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తొలగించారు. భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -I శీతాకాల ప్రత్యేక శిబిరం 4వ రోజు సోమవారం రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ జనగాం పాండు, ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, గ్రామ కార్యదర్శి లోకేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోటకూరి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ యూనిట్ – I వాలంటీర్స్ పాల్గొన్నారు.