ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్రోగి సహాయకులకు సత్యసాయి సేవా ట్రస్ట్ అన్న ప్రసాద పంపిణీ

రోగి సహాయకులకు సత్యసాయి సేవా ట్రస్ట్ అన్న ప్రసాద పంపిణీ

📰 Generate e-Paper Clip

గత 7 సంవత్సరాలుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం కొనసాగింపు

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

భగవాన్ శ్రీ సత్య సాయిబాబా కృపాకటాక్షలతో శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్, భగవాన్ శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన ట్రస్ట్, సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో గల సత్యసాయి అన్న ప్రసాద కేంద్రంలో రోగి సహాయకులకు ఒకపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ ఎలిమే ఈశ్వరయ్య తెలిపారు. గత ఏడు సంవత్సరాల నుండి అన్న ప్రసాద కార్యక్రమం ప్రతిరోజు నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్న సమయంలో 120 నుండి 150 మంది వరకు రోగి సహాయకులకు భోజనం అందజేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా పండుగలు, ఉత్సవాలు ఉన్న రోజు అధిక మొత్తంలో అన్న ప్రసాద పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రాంత వాసులు తమ కుటుంబ సభ్యుల వివాహ దినోత్సవం, పుట్టినరోజు, ఇతర సందర్భాల పేరిట స్వయంగా కుటుంబ సభ్యులు వచ్చి అన్న ప్రసాదాన్ని అందజేయొచ్చని తెలిపారు. ఆదివారం వాస ఈశ్వరయ్య పేరిట అన్న ప్రసాద పంపిణీ చేశామని తెలిపారు. దాతలు, సేవకులు మరిన్ని వివరాలకు 9441303182 లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంధం సాయి ప్రకాష్, పాండు, రంగారావు, ఈ.బాలయ్య, పోల నాణ్యం, పోల రాము, శేఖరచారి, లక్ష్మణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!