prathighatana.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 11:34 am Digital Edition : PRATHI GHATANA

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం

పంతంగి రాజ్ భూపాల్ గౌడ్

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

కాంగ్రేస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందేనని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ .రామచందర్ రావు పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనందుకుగాను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం, మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి , అంజన్ కుమార్ గౌడ్, పోరెడ్డి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు పాపయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవేందర్ రెడ్డి, నారాయణ యాదవ్, జ్ఞానేశ్వర్, పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.