రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ జిల్లెలగూడ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఒంటేరు నరసింహా రెడ్డి, ఫెడరేషన్ సభ్యులు వివిధ కాలనీవాసులు కలిసి బీజేపీ క్లస్టర్-2 అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్ , మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఒంటేరు నరసింహరెడ్డి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంపై దేశవ్యాప్తంగా ఉన్న విశ్వాసంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న రాజీలేని పోరాటం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ పట్ల వివిధ వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుండి ఇంత భారీ ఎత్తున పార్టీలో చేరడం శుభ పరిణామమని రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ సుభాష్ , అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి, జిల్లా మాజీ అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, క్లస్టర్-1 అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి, జిల్లా కౌన్సిల్ సభ్యులు సోమేశ్వర్, మాజీ కార్పొరేటర్ కీసర హరినాథ్ రెడ్డి, గౌరీ శంకర్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సిద్ధాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిల్లంపల్లి రాజశేఖర్, మహిళా మోర్చా నాయకురాలు రజిని తదితరులు పాల్గొన్నారు.
