prathighatana.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 12:29 pm Digital Edition : PRATHI GHATANA

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నూతన ఆసుపత్రి భవనానికి 40 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నూతన ఆసుపత్రి భవనానికి 40 కోట్ల రూపాయలు కేటాయించాలని, అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించడానికి డాక్టర్స్ ను నియమించాలని, 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండాలని, అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించడానికి పరికరాలు ఏర్పాటు చేయాలని, హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ గత 3 రోజులుగా రామన్నపేట మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేష్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరేళ్ల నరసింహ చారి, కందుల హన్మంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, నాగాటి ఉపేందర్, వేముల సైదులు, శానకొండ రామును కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేసిన అనంతరం కొండమడుగు నర్సింహా మాట్లాడుతూ.. గ్రామీణ పేదలకు కీలకంగా ఉపయోగపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి అనేక రకాల సమస్యలకు నిలయంగా మారిందని అన్నారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు వైద్యం అందడం లేదని అన్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లా కేంద్రం లేదా హైదరాబాద్ గాంధీ లేదా ఉస్మానియా హాస్పిటల్ కు పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది హైదరాబాద్ కు పోలెక, ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించు కోవడానికి డబ్బులు లేక ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఈ బడ్జెట్లో 40 కోట్లు రూపాయలు కేటాయించాలని, 100 పడకల స్థాయికి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ప్రభుత్వం స్పందించిక పోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కొండమడుగు నర్సింహ హెచ్చరించారు.