ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జీ హెచ్ఎంసీ బాలాపూర్ 62వ డివిజన్‌లో రంజాన్ పండగను పురస్కరించుకొని వెంకటాపూర్ గ్రామంలో ముస్లిం సోదర సోదరీమణులకు మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ సిల్వేరి సాంబశివ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర రంజాన్ మాసం శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఉపవాస దీక్షల ద్వారా మనసును శుద్ధి చేసుకొని పరస్పర ప్రేమ, సహనాన్ని పెంపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అల్లాహ్ కృపతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో కళకళలాడాలని ప్రార్థించారు. ఈకార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.