ధరూర్ మండలం యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సమీర్ ముజాహీద్
ప్రతిఘటన, జోగులాంబ గద్వాల రిపోర్టర్ గడ్డం సుధాకర్
రంజాన్ మాసం నుండి నేర్చుకోవాల్సిన ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని, ఆధ్యాత్మికంగా సహనం, ప్రేమ, వ్యక్తిత్వాన్ని నేర్పిస్తుందని ధరూర్ మండలం యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సమీర్ ముజాహీద్ పేర్కొన్నారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ పర్వదినాన్ని శనివారం ధరూర్ మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ధరూర్ మండల కేంద్రంతో పాటు ఉప్పేర్, మార్లబీడు, చింతరేవుల, రేవులపల్లి, మన్నాపురం, తదితర గ్రామాలలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఖురాన్ సూక్తులను బోధించారు. అనంతరం చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు.
