ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్రంజాన్ ఏర్పాట్లపై కమిషనర్ పర్యవేక్షణ

రంజాన్ ఏర్పాట్లపై కమిషనర్ పర్యవేక్షణ

📰 Generate e-Paper Clip

మసీదుల, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి

ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మసీదుల, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, జోనల్ కమిషనర్ చంద్రకళ అన్నారు.
జల్ పల్లి సర్కిల్–17 పరిధిలోని వివిధ వార్డుల్లో వారు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ-వెస్ట్ మెగా కలెక్షన్ కార్యక్రమం రంజాన్ పండుగ నేపథ్యంలో జల్ పల్లి సర్కిల్–17 పరిధిలోని ఈద్గాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లు పనులను పరిశీలించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సర్కిల్ లో అవసరమైన ఏర్పాట్ల కోసం అధికారులకు సూచనలు జారీ చేశామని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఎక్కడైనా డ్రైనేజీ మ్యాన్ హోల్ సమస్యలు, గుంతల రోడ్లు ఉంటే మరమ్మత్తులు పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. మసీదుల వద్ద వీధి దీపాల పని తీరు పర్యవేక్షించాలని, మసీదుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇష్రత్ ఆయేషా, తాన్వీర్, వినీత్, సానిటరీ ఇన్స్పెక్టర్ మొయిన్ బాబా ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!