ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లాలోని కందుకూరులో కేటాయించిన మెడికల్ కాలేజీనిఅక్కడే కొనసాగించాలి -మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని కందుకూరులో కేటాయించిన మెడికల్ కాలేజీనిఅక్కడే కొనసాగించాలి -మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగిందని, దానిని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎల్బీనగర్ కు తరలించకుండా కందుకూరులోనే కొనసాగించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన క్వశ్చన్ అవర్ ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన చర్చలో మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు గతంలో మంజూరైన మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆమె మాట్లాడుతూ.. కందుకూరులో ప్రారంభించిన మెడికల్ కాలేజీని
​ప్రస్తుతం ఎల్బీనగర్‌కు తరలిస్తున్నారనే వార్తలు వింటున్నామని, ఇది కందుకూరు ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం హైవేపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అక్కడ ప్రమాదం జరిగినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్ వచ్చే వరకు మధ్యలో ఎక్కడా సరైన వైద్య వసతులు లేవని, పేషంట్ హైదరాబాద్ చేరుకునే లోపు మార్గమధ్యలో చనిపోయే అవకాశం ఉందని ఆమె అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం వంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే 400 పడకల ఆసుపత్రి కూడా వస్తుందని, తద్వారా ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు. ఇప్పటికే కందుకూరులో స్థలం కూడా కేటాయించి, గతంలోనే హరీష్ రావు ఫౌండేషన్ వేయడం జరిగిందని గుర్తు చేస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీని ఎల్బీనగర్‌కు మార్చకుండా, కందుకూరులోనే కొనసాగించాలని ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు. ​ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను గమనించాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!