prathighatana.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 1:50 pm Digital Edition : PRATHI GHATANA

యుద్ధాలతో పెరుగుతున్న గ్యాస్ ధరలు

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు విరుద్ధం

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మొపే విధానాలు అపి, అందరికి వంట గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకువాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం పెరబోయిన మహేందర్ అధ్యక్షతన నిర్వహించగా ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధమని అయన తీవ్రంగా విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్‌పిటీసీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేసి విజయాలు సాధించే దిశగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చెడ చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్, కళ్లెం కృష్ణ, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, బచ్చనగోని గాలయ్య, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, పల్లె శేఖర్ రెడ్డి, చిగుర్ల లింగం, ఏశాల అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కల్లేపల్లి మహేందర్, గాదెగాని మాణిక్యం, దుబ్బాక భాస్కర్, అన్నేమైన వెంకటేష్, ఉట్కూరి నర్సింహా, రేకల శ్రీనివాస్, సిలివేరు దుర్గయ్య, లక్ష్మయ్య, గోరేటి రాములు, ఎలగందుల అంజయ్య, చిలివేరు అంజయ్య, కలకొండ సంజీవ, ఆలేటి బాలరాజు, జెల్ది రాములు, ఎల్లంకి మహేష్, ఉప్పాల శాంతి కుమార్, ఇంజ హేమలత, అరే పుష్ప, వడ్లకొండ భారతమ్మ పాల్గొన్నారు.