ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్మొక్క జొన్న రైతులకు ప్రభుత్వం బకాయి డబ్బులు వెంటనే విడుదల చేయాలి

మొక్క జొన్న రైతులకు ప్రభుత్వం బకాయి డబ్బులు వెంటనే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలబడే పార్టీ అని కందుకూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్ తెలిపారు. కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా పార్టీ సహించదని స్పష్టం చేశారు.
నేదునూరు గ్రామం కందుకూరు మండలంలో అతిపెద్ద గ్రామమని పేర్కొంటూ, అక్కడి మొక్క జొన్న రైతులకు బకాయి డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతులను తిప్పలు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. రైతుల కష్టాలు, బాధలు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ పాపం తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగులుతుందని హెచ్చరించారు. “ఇది నిజంగా రేవంత్ రెడ్డి రాజ్యమేనా?” అని ప్రశ్నించారు. అలాగే, గతంలో చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు. ఈ వారం రోజుల్లో రైతులకు బకాయి డబ్బులు విడుదల చేయకపోతే, కేవలం నేదునూరు గ్రామం మాత్రమే కాదు, కందుకూరు మండలంలోని అన్ని గ్రామాల రైతులతో కలిసి పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!