పూజారి కొడుకు ప్రమాదానికి మంత్రి సీతక్కదే బాధ్యత
సీతక్క, కాంగ్రెస్ సర్కారు వనదేవతలనూ వదల్లేదని ఆగ్రహం
మంత్రి పొంగులేటితో కలిసి రూ.200 మింగేశారని ఆరోపణ
మంత్రుల అవినీతికి బాలుడు కాళ్లు విరిగిపోయాయని మండిపాటు
రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి
మేడారం సమ్మక్క, సారలమ్మ అభివృద్ధి పనుల పేరుతో మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల భారీ 200 కోట్లు అంటే భార్య ను 200 కోట్ల కుంభకోణం చేసిందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. శతాబ్దాల పాటు నిలిచిపోయేలా పనులు చేస్తున్నామని సర్కారు గొప్పలు చెప్పుకున్నదని.. కానీ.. జాతర పూర్తైన వారం రోజులకే అక్కడ రాతి కట్టడాలు కూలిపోయాయన్నారు. సర్కారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ఇప్పుడు ఏకంగా ఆలయ పూజారి రమేష్ కుమారుడు తన కాళ్లను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. రూ.200 కోట్లు మింగేసి.. పూర్తిగా నాణ్యతా లోపంతో పనులు చేశారని మండిపడ్డారు. సర్కారు అవినీతికి ఏకంగా ఆలయ పూజారి కుమారుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఈ ఘటనకు మంత్రి సీతక్కే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని.. వారి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే.. కమీషన్లకు ఆశపడి.. అత్యంత దారుణంగా.. నాణ్యతా లోపంతో పనులు చేసినందుకు.. వనదేవతలను అవమానించినందుకు.. గిరిజన బిడ్డలకు, యావత్ తెలంగాణ సమాజానికి మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలన్నారు. అయినదానికి.. కాని దానికి తాను గిరిజన బిడ్డనంటూ సింపథి ప్రయత్నాలు చేసే సీతక్క.. వనదేవతల గద్దెల నిర్మాణంలో మాత్రం ఆ విషయం మరిచిపోయారని.. కేవలం కమీషన్ల గురించే ఆలోచించినట్టుగా అక్కడి పనులు.. ప్రమాదాలను చూస్తే అర్థమవుతోందన్నారు. నిర్మాణాలు నాణ్యతా లోపంతో ఉన్నాయని.. బీఆర్ఎస్ పార్టీ ముందే హెచ్చరించిందని సతీష్ రెడ్డి అన్నారు. స్వయంగా తమ పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి మరీ ప్రపంచానికి చూపించారన్నారు. అయినా కూడా సర్కారు గానీ.. స్వయంగా ఆదివాసీ బిడ్డనని చెప్పుకునే సీతక్క కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. హెచ్చరించిన తర్వాత కూడా నాణ్యతా లోపంపై, సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు బాలుడు కాళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. మేడారం అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతీ దానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించే రేవంత్ రెడ్డి.. వెంటనే మేడారం పనులపై సిట్ దర్యాప్తునకు గానీ.. సిట్టింగ్ జడ్జితో గానీ దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. లేకపోతే.. ఈ అవినీతిలో ముఖ్యమంత్రితో సహా.. కేబినెట్ మొత్తానికి భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుందన్నారు.