prathighatana.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 12:49 pm Digital Edition : PRATHI GHATANA

మురుగు నీరుతో ఇబ్బందులు పడుతున్న రాజీవ్ గృహకల్ప వాసులు – పట్టించుకోని అధికారులు

బడంగ్ పేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మురుగు నీటి పైపులైన్లు పగిలి ఆ ప్రాంతమంతా చెరువు కుంటలా మారి తీవ్ర దుర్గంధంతో రాజీవ్ గృహకల్ప వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బడంగ్ పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయంకు కూత వేటు దూరంలో రాజీవ్ గృహకల్ప దగ్గర చెరువు కుంటలా తయారైన మురుగు నీటిని కాలనీ వాసులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా భూగర్భ డ్రైనేజీ పైపులు పగిలి రోడ్డుపై మురుగు ప్రవహిస్తుందన్నారు. చెరువుగా మారడంతో ముక్కు పుటలు అదిరిపోయే దుర్గంధం వెదజల్లుతుందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా సర్కిల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వారికి చీమ కుట్టినట్టు కూడా చలనం లేదన్నారు. నిద్ర మత్తులో ఉన్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.