ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్మున్సిపల్ గౌడ కౌన్సిలర్లకు ఘన సన్మానం

మున్సిపల్ గౌడ కౌన్సిలర్లకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

జై గౌడ ఉద్యమ సంఘ జిల్లా మహిళా అధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన గౌడ కులస్తుల కౌన్సిలర్లకు ఆదివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ గౌడ కౌన్సిలర్లకు జైగౌడ ఉద్యమ సంఘం నాగర్ కర్నూల్ జిల్లా వారిచే శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జైగౌడ ఉద్యమ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి నారాయణ గౌడ్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులు అన్ని విభాగాలలో ప్రాతినిధ్యం వహించాలని,ప్రజలకు మెరుగ్గా ప్రజా సేవలందించుటకు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. జైగౌడ నాగర్ కర్నూల్ జిల్లా ఉద్యమ మహిళ అధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువలో చేర్చుటకు ప్రతి గౌడ కులస్తుడు రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ సంక్షేమ విభాగాలలో ముందుండాలని ఆమె కోరారు. నాగర్ కర్నూల్ లో నూతనంగా ఎన్నికైన19వ వార్డు కౌన్సిలర్ కాట గౌని సునీత శ్రీనివాస్ గౌడ్, మూడో వార్డు నుండి ఎంపికైన వసంత సంతోష్ గౌడ్,9వ వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందిన సుంకరి అలివేల, రాజేష్ గౌడ్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానం చేశారు. నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవలో నూతన కౌన్సిలర్లు ముందుండాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమ యూత్ అధ్యక్షులు కటగౌని హరీష్ గౌడ్, ప్రసాద్ గౌడ్, సింగారి జ్యోతి గౌడ్, పలుస నిర్మల గౌడ్,గుండ్రాతి సత్యం గౌడ్, కల్పన, సువర్ణ, నిర్మల, యశోద, సుమతమ్మ, విద్య, పుష్ప, శోభ, హేమలత, కవిత, పద్మ,స్రవంతి గౌడ సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!