ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణమాయ మాటలతో మరోసారి ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మాయ మాటలతో మరోసారి ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ లకు తీవ్ర అన్యాయం

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా రిపోర్టర్ జంగిటి రవీందర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతో మరోసారి ప్రజలను మోసం చేశారని బడ్జెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగం బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు కానీ, బీసీ, ఎస్సీలకు కానీ ప్రత్యేక సబ్ ప్లాన్లు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఒక్క రూపాయి నిధులు ప్రత్యేకంగా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి రావడానికి మాత్రమే ఆరోజు అనేక తప్పుడు హామీలు చెప్పారని కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారని అన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం అని, గొర్రెల పెంపకం దారులకు, చేపల పెంపకం దారులకు 2 లక్షల రూపాయలు ఇస్తానని, దళిత బంధు ప్రతి ఒక్క దళితులకు 12 లక్షల రూపాయలు, బీసీ బందు ప్రతి ఒక్కరికి ఇస్తానని రైతుబంధు సంవత్సరానికి మూడు పంటలకు ఇస్తానని, పెన్షన్ 4000 ఇస్తామని, మహిళలకు 2500, ప్రతి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఈ విధంగా అనేక మాయమాటలు చెప్పి ఇప్పుడు బడ్జెట్ లో ఏ ఒక్క పథకానికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వలేదన్నారు. రానున్న రోజులలో ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మాజీ జెడ్పిటీసీ సుబ్బురు బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇట్టబోయిన గోపాల్, కౌన్సిలర్లు నాకోటి నగేష్, చీమల రాజు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నర్సింగరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాడూరి బిక్షపతి, ఇక్బాల్ చౌదరి, కాజం, అంజద్, సూరిపంగా సుభాష్, గుజ్జ పవన్, డొప్ప వెంకటేష్, బచ్చు వెంకటేష్, సైదులు, విక్రమ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!