prathighatana.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 3:19 pm Digital Edition : PRATHI GHATANA

మహేశ్వరం మండల కేంద్రంలో ఉగాది పంచాంగ శ్రవణం

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో
గ్రహస్థితులు, రాశి ఫలాలు, వర్షం, పంటలు, రాజకీయ పరిస్థితులు వంటి శుభా శుభాలను తెలుపుతుందని కటేపల్లి శ్యాం సుందర్ శర్మ పంతులు, మడుపతి మణికంఠ పంతులు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మహేశ్వరం గ్రామంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, పెద్దల ఆధ్వర్యంలో కటేపల్లి శ్యాం సుందర్ శర్మ పంతులు, మడుపతి మణికంఠ పంతులు చే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్యాం పంతులు పంచాంగం గురించి వివరిస్తూ ఇది ఈ సంవత్సరంలో గ్రహ స్థితులు, రాశి ఫలాలు, వర్షం, పంటలు, రాజకీయ పరిస్థితులు వంటి శుభాశుభాలను తెలుపుతుందని. ఈ శ్రవణం వినడం వల్ల శుభం, ఆయుర్వృద్ధి కలుగుతాయని ఇది భగవదనుగ్రహ కారకం అన్నారు.. ఈ కార్యక్రమంలో పోతర్ల అంబయ్య యాదవ్, శివ మూర్తి, అల్లే కుమార్, స్వర్ణగంటి ఆనందం, పోతర్ల సుదర్శన్ యాదవ్, నిమ్మగూడం సుదీర్, కాడమోని ప్రభాకర్, మక్కాజి, చంద్రమౌళి, భిక్షపతి, బాలయ్య, అంజప్ప, కృష్ణ యాదవ్, కటికల మహేందర్, తెల్జీరి శ్రీశైలం, మిద్దింది బాలరాజ్, కర్రోళ్ల శ్రీనివాస్, దూసగంటి మహేందర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు..