ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణమహిళ స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీలో భారీ స్కాం

మహిళ స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీలో భారీ స్కాం

📰 Generate e-Paper Clip

అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ ల డిమాండ్‌

కలెక్టరేట్‌ లో ఏవో అంజిరెడ్డికి వినతి పత్రం అందజేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు.. నాయకులు

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

భువనగిరి పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టరేట్‌ ఏవో అంజిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మెప్మా అధికారులు, రిసోర్స్‌ పర్సన్లు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై, అర్హులైన మహిళలకు అందాల్సిన రుణాలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం రుణాలు ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్ల పేద మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. పట్టణంలోని 48 మంది రిసోర్స్‌ పర్సన్లపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యుల ఆస్తులను జప్తు చేసి ఆ నగదును తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తక్షణమే విచారణ జరిపి మహిళలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ లు నాగిటీ నగేష్, ఏలే భూవనేశ్వరి శివకుమార్, చెన్న స్వాతి మహేష్, చీమల రాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనవాస్‌రెడ్డి ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!