జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర
భీమ్ యాత్రలో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటిత పరచి విద్యా ఆవశ్యకతను తెలిపిన మహనీయుడు జ్యోతిరావు పూలే, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి, మనుషులందరూ సమానమే అని సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అలాగే హక్కులు అనేవి అడుక్కుంటే రావని పోరాడి సాధించుకోవాలని చెప్పిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. వారు సూచించిన మార్గాలను, ఆశయాలను స్పూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని అన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర హైదరాబాద్ చౌరాస్తా నుండి ప్రారంభమై నల్గొండ చౌరస్తా, జంఖాన్ గూడా, బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా, పాత బస్టాండ్ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. యాత్ర లో పాల్గొన్న.. బట్టు రాంచంద్రయ్య, నాగరం అంజయ్య , బర్రె జహంగీర్, దొనకొండ రాములు సురుపంగా శివలింగం, ఎం.డీ ఇలియస్, కర్తల శ్రీనివాస్, ఇటుకల దేవేందర్, కుతడి సురేష్, నాగరం శంకర్, కనుకుంట్ల రమేష్ కోటి, చింతల శివ, వనం రాజు, కారుపటి రాజు, బర్రె నరేష్, కౌన్సిలర్స్, బొంతల నర్సింగ్ రావు, జాలిగం విగ్నేష్, బర్రె పూజిత, బట్టుపల్లి అనురాధ, బర్రె ప్రమీల, గాయపక శ్రవణ్, జాలిగం శివ, కాశపక మహేష్ , ఆనంపట్ల కృష్ణ, దుబ్బ రామకృష్ణ మాదిగ సురేష్, వడ్డేపల్లి దాస్, హాస్టల్ విద్యార్థులు, జై భీం ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.