ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మల్లన్న (మల్లికార్జున స్వామి) శివుని అవతారంగా భక్తులు విశ్వసిస్తారని మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జల్ పల్లి డివిజన్ పరిధి, శ్రీరామ కాలనీలోని రిలయన్స్ కాలనీలో మల్లన్న గుడిపైన గోపురం ఏర్పాటు సందర్భంగా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి, ఎస్సై లక్ష్మయ్య ను సన్మానించారు.
మల్లన్న చిత్రపటాన్ని వారికి బహుకరించారు. వీరితో పాటు సుమారు 15 వందల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మల్లన్నను శివుని అంశగా భావిస్తారన్నారు. బలిజ మేడల్లమ్మ, గొల్ల కేతమ్మలను ఆయన భార్యలుగా పూజిస్తామని తెలిపారు. మల్లన్న దర్శించుకున్న వారికి సకల సంపదలు లభిస్తాయని ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శత్రు చారి వాగే, చంద్రకాంత్, హనుమంతు మారాజ్, గోపాల్ మారాజ్, సుధా మారాజ్, మారుతి, ఉమాకాంత్, రామ్ ఖరణ్ సింగ్, విష్ణు కాంత్, ఓంకార్ , సంజయ్, నవనాథ్, విటల్ మహారాజ్, ప్రశాంత్, సంజయ్, గోపాల్ మారాజ్ తదితరులు పాల్గొన్నారు.