ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి, దేశ రక్షణ, దేశ సంస్కృతి కాపాడుతుందన్నారు. భారత దేశంలో ప్రతి భారతీయుడికి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేస్తుందన్నారు. ఉజ్వల గ్యాస్, ఉచిత రేషన్ స్వచ్ఛభారత్, పల్లె ప్రకృతి వనాలు, స్మశానవాటికలు ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేతృత్వంలో 85% నిధులతో రాష్ట్రాలను ముందుకు నడుపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ప్రజా సేవలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కే.కే రెడ్డి, జీ. కురుమన్న, జీ. తిమ్మప్ప, బీ. మధు, వెంకీ జగన్ గౌడ్, వెంకటేష్, వెంకటపతి, చెన్నకేశవులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.