prathighatana.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 2:29 pm Digital Edition : PRATHI GHATANA

మధుర నగర్‌లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రతిఘటన ప్రతినిధి ముత్తయ్య

కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్టుగా పనులు ముందుకు సాగడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి 57 వ నాదర్‌గుల్ డివిజన్ పరిధిలోని ఆల్మాస్ గూడ మధుర నగర్ కాలనీ ఫేజ్–3 లో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్టుగా పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. మంత్రులు వేసిన శిలా ఫలకాలు శిలా ఫలకాలుగానే మిగిలి పోయాయని, కానీ పనులు మాత్రం ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు. కాలనీలలో మిగతా అన్ని డివిజన్లలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, కనీసం ఈ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మున్సిపల్ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని ఫాగింగ్ కూడా సరిగా చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రజల పక్షాన నిలబడాలని ఈ ప్రభుత్వానికి హితువు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ సమ్ రెడ్డి సప్న వెంకటరెడ్డి , బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, తుఫాన్ రెడ్డి , కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు కాలనీ వాసులు పాల్గొన్నారు.