ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు ఠాను నాయక్

భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు ఠాను నాయక్

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ముండ్రాయి దొర గూండాలతో పోరాడుతూ 1950 మార్చి 20న వీరమరణం పొందిన ఠాను నాయక్ త్యాగాలను స్మరిస్తూ, ఆయన విగ్రహాలను ప్రతిష్టించాలని, పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని ప్రజా సంఘాలు, గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లంబాడీల కొదమ సింహం జాటోతూ ఠాను నాయక్ 77వ వర్ధంతి సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై కొలువైన ఠాను నాయక్ 77వ వర్ధంతి కార్యక్రమాన్ని మీర్పేట్ ప్రాంతంలోని బంజారా లందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఠాను నాయక్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఠాను నాయక్ యొక్క పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్ తరాలలో గిరిజన జాతి యొక్క చైతన్యాన్ని కాపాడుతూ, ప్రస్తుతం గిరిజనులకు రావలసిన, దక్కవలసిన వాటాను వారి హక్కులను కాపాడుకోవాలని ట్యాంక్ బండ్ పైన ఠాను నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించారు. ఠాను నాయక్ స్ఫూర్తితో గిరిజనుల భూములను కాపాడుకుంటాం గిరిజన భూములపైన జరుగుతున్న దాడులను ఖండిస్తామని గిరిజనుల భూముల పైన జరుగుతున్న దాడులు ఏ ప్రదేశంలో అయితే జరుగుతుందో ఆ ప్రదేశంలో ఠాను నాయక్ విగ్రహాన్ని పెట్టి ఆందోళన కార్యక్రమాలు చేయాలని గిరిజన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు నీలా రవి నాయక్, బంజారా నాయకులు ప్రొఫెసర్ శంకర్ నాయక్, హాము నాయక్, బన్సీలాల్ నాయక్ అశోక్ రాథోడ్, పూర్యా నాయక్, దేవానంద్ నాయక్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘు , బీసీ సంఘాల నాయకుడు ఆకుల శ్రీనివాస్, బడంగ్పేట్ బంజారా వెల్ఫేర్ అధ్యక్షుడు రాజు నాయక్, జూమ్లా నాయక్, బంజారా జాతీయస్థాయి నాయకుడు భోనా నాయక్ ,రామకోటి బహుజన సమాజ్ వాది పార్టీ నాయకుడు భౌగుణ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ ధర్మానాయక్, చందర్ నాయక్, శివ నాయక్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!