ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణభూదాన్ భూములు ఎవరి సొత్తు..?

భూదాన్ భూములు ఎవరి సొత్తు..?

📰 Generate e-Paper Clip

మీ.. అబ్బ జాగీరా.. ఎవడబ్బ సొమ్మని.. పేదలను రోడ్డున వేస్తారు..?

ఇందులో సూత్రధారులు పాత్రధారులు.. ఎవరు..?

పేదలకు దానం చేయడం కోసం సేకరించిన భూదాన్ భూములు ఎవడి పాలవుతున్నాయి..?

నాటి బోర్డు తప్పిదమా.. నేటి రాజ్యం తప్పిదమా..?

ఇందులో బోర్డు.. రాజ్యం రెండు కూడా దోషులే..!

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

ఒక మహా సంకల్పంతో.. ఆనాడు భూస్వామ్య.. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా.. జమీందారులు జాకీర్దారులు వందలాదికరాల భూములను ఆచార్య వినోబాభావే చేపట్టిన భూదానోద్యమంలో పాల్గొని దానం చేశారు. తెలంగాణ రైతాంగ భూస్వామ్య పోరాట ఫలితంగా కమ్యూనిస్టులకు భయపడి నాటి ప్రధాన మంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ సూచన మేరకు లక్షల ఎకరాల భూములను దానం చేశారు చేశారు. మహనీయుడు ఆచార్య వినోబా బావే గారు కూడా ఆ భూములను పేదలకు పంచాలనే సంకల్పంతో మహా యజ్ఞం నిర్వహించారు. దేశంలో లక్షల ఎకరాల భూములను సేకరించారు. వాటిని పేద ప్రజలకు పంచేందుకు ప్రత్యేక చట్టం చేశారు. కానీ ఆ చట్టాలన్నీ వాళ్ళ తదనంతరం దొంగల చేతిలో పడ్డాయి. భూములను పంచలేదు కదా.. వందల కోట్ల రూపాయలు సంపాదనకు మార్గం చూపించాయి. భూదాన్ యజ్ఞ బోర్డ్ పేరుతో.. కాసుల యజ్ఞం చేశారు. అందులో వెలుగు చూసిందే వెలుగుమట్ల.. పేరుకు వెలుగుమట్ల అయినా.. దాని వెనక చీకటి కోణం.. దాగుంది. లక్షల రూపాయలు వసూలు చేసి పదేళ్ల కిందనే ప్రొసీడింగ్లు ఇచ్చారు. తమ అవసరాల కోసం కోర్టు ఫీజులు ఖర్చుల కోసం అంటూ వేల కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే.. పేదల కోసం దానం చేసిన భూములు.. ఇప్పుడు వాళ్లకు వాటిపై హక్కు లేదంటూ రాజ్యం కన్నెర్ర చేస్తుంది. దొంగలంతా తప్పించుకున్నారు. కానీ పేదల బతుకులు మాత్రం రోడ్డున పడ్డాయి. భూదాన్ భూముల పై సమగ్ర విచారణ జరగాలి. ఆ భూములు పేదలకు చెందాలి. ఎందుకంటే ఆచార్య వినోబా భావే గారు పేదల కోసం సేకరించిన ప్రతి సెంటు భూమి పేదవాడికే చెందాలే. దానిపై ప్రభుత్వాలకి గానీ.. దొంగలకు గాని ఎటువంటి నియంత్రణ ఉండకూడదు. ఇందుకోసం చట్ట పరిధిలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!