prathighatana.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 4:36 pm Digital Edition : PRATHI GHATANA

భువనగిరి హనుమాన్ వాడలో మహిళా సంఘాల సభ్యుల ఆందోళన

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

భువనగిరి పట్టణంలో మహిళా సంఘాల డబ్బులను ఆర్పిలు సువర్ణ , దివ్య సభ్యులకు తెలవకుండా డ్రా చేసుకొని సొంతంగా వాడుకున్నారని వారిని కఠినంగా శిక్షించాలని హనుమాన్ వాడలో మహిళా సంఘాల సభ్యులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సంతకాలు ఫోర్జరీ చేసి సభ్యులు లేకుండానే ఆర్పీల చేతులకు డబ్బులను ఇచ్చిన కెనరా బ్యాంక్ ఇంచార్జ్ రమేష్ బాబు, కెనరా బ్యాంక్ సిబ్బందిపై కేసులు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో సంఘానికి సంబంధించి 20 లక్షల వరకు డ్రా చేసుకుని ఆర్పీలు కోట్ల రూపాయల నిధులను సొంతంగా వాడుకున్నారని వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.