ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణభారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పై నిషేధం ఎత్తివేయాలి

భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పై నిషేధం ఎత్తివేయాలి

📰 Generate e-Paper Clip

మావోయిస్ట్ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి

జైళ్లలో ఉన్న మావోయిస్టు ఖైదీలు అందరిని రాజకీయ ఖైదీలుగా విడుదల చేయాలి

ఆయుధాలు వదిలేసి జనంలోకి వచ్చిన పార్టీకి రాజ్యాంగ హక్కులు కల్పించాలి

అమరుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి

మావోయిస్టు పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు దేవ్ జీ

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో

భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పై నిషేధం ఎత్తివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ దేవ్ జీ ప్రధాన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆయుధాలు వదిలేసిన మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి. జైల్లో ఉన్న మావోయిస్టు ఖైదీల అందరిని రాజకీయ ఖైదులు గా గుర్తించి విడుదల చేయాలి. మావోయిస్టు అమర కుటుంబాల అందరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వారికి పునరావాసం కల్పించాలి. ఆయుధాలు వదిలేసి జనంలోకి వచ్చిన మావోయిస్టు పార్టీకి రాజ్యాంగ హక్కులు కల్పించాలి. ఈ ప్రధాన డిమాండ్లతో ముందుకు వెళ్లడమే మా లక్ష్యం అంటూ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవ్ జీ స్పష్టమైన ప్రకటన. ఈ ప్రకటనపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నక్సల్ విముక్తి భారత్ పేరుతో ఆపరేషన్ చేపట్టింది. లక్ష్యం నెరవేరింది. మరి ఒక పార్టీని రాజకీయ పార్టీగా గుర్తిస్తుందా లేదా.. దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 60 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ.. ప్రజల పక్షాన పక్షాన పోరాడే పార్టీని రాజకీయ పార్టీగా గుర్తిస్తుందా.. లేదా..? చూద్దాం..? అలా చేయకపోతే ప్రజల తీర్పు కూడా మరో విధంగా ఉంటుంది కదా.. ప్రజలు ఎప్పటికీ తమ తమకోసం నిలబడే వారిని కోరుకుంటారు అది చారిత్రక చరిత్ర సత్యం.. చరిత్ర ఎవరుండాలనేది నిర్ణయిస్తుంది..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!