ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంభారత్ లో మళ్లీ లాక్ డౌన్..? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ

భారత్ లో మళ్లీ లాక్ డౌన్..? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. “ఇంకొన్ని రోజుల్లో లాక్‌డౌన్ అమలు” అంటూ వస్తున్న సందేశాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రస్తుతం దేశంలో ఎటువంటి లాక్‌డౌన్ పరిస్థితి లేదని, సాధారణ జీవనం యథావిధిగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పాఠశాలలు, కార్యాలయాలు, రవాణా వ్యవస్థలు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగుతాయన్నారు.

ఈ రూమర్లు ప్రధానంగా సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్‌ల కారణంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ “అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి” అన్న వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడంతో లాక్‌డౌన్ వార్తలు మరింత ప్రచారం పొందాయి.

అంతేకాకుండా అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కూడా ఈ రూమర్లకు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతానికి దేశంలో ఆరోగ్య లేదా భద్రత పరంగా లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవని అధికారులు స్పష్టం చేశారు.

మొత్తానికి, ఇండియాలో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసే ప్రణాళిక ఏదీ లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు సోషల్ మీడినయాలో వచ్చే అపోహలను నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!