ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 17 వరకు
క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను విడుదల చేసిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో ప్రతినిధి
షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 17 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్. బాలకృష్ణ, నేర్లకంటి శ్రీకాంత్ వెల్లడించారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన గోడ పత్రికను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్. బాలకృష్ణ, నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశ స్వాత్రంత్ర్యలో కీలక భూమిక పోషించారని, అటువంటి మహనీయుడిని స్మరిస్తూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్ ను రాష్ట్ర పరిధిలోని యువజన, క్రీడల శాఖ మాత్యులు వాకిటి శ్రీహరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా, ఏమినెంట్ క్రీడాకారులు ముఖ్య అతిధిలుగా హాజరై ప్రారంభిస్తారని, అదే విధంగా జిల్లా యువజన క్రీడాశాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారని వారు ప్రకటించారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలనే యువత కో- ఆర్డినేటర్ శ్రీకాంత్ (7386690103), ఆర్గనైజర్స్ బాలకృష్ణ (8885173361), మహమూద్ (8121347855) నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, కార్యవర్గ సభ్యులు కళ్యాణ్, జోసెఫ్ భాను, అనీల్ కుమార్ పాల్గొన్నారు.