prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 11:09 am Digital Edition : PRATHI GHATANA

భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల విప్లవ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

పీ.డీ.ఎస్.యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మంద నవీన్

ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి :

ప్రగతీశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) దిల్ సుఖ్ నగర్ కార్యవర్గం ఆధ్వర్యంలో విప్లవ స్వాతంత్ర సమర యోధులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యులుగా పీ.డీ.ఎస్.యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మంద నవీన్ హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ వలస పాలనపై తిరుగుబాటు జెండేత్తి, విప్లవాన్ని రగిలించి, భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సోషలిజాన్ని జోడించి స్వేచ్ఛ, సమానత్వం, సార్వబౌమత్వంతో పాటు ఎలాంటి దోపిడీ, పీడన లేని స్వాతంత్రానికై భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు తమ విలువైన ప్రాణాలను తునప్రాయంగా వదులుకున్నారన్నారు. తెల్లవాడు పోయి నల్ల వాళ్ళు అధికారాన్ని చేపట్టి అదే అధిపత్య అహంకారాన్ని ప్రదర్శిస్తే అది అధికార మార్పిడే తప్ప స్వాతంత్రం కానే కాదన్నారని గుర్తు చేసారు. 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్వాలాబాగ్ దుర్ఘటన భగత్ సింగ్ ను కలిచివేసిందని, ఈ దుర్ఘటణలో అమరులైన వారి రక్తపు మట్టిని సీసాలో తీసుకొని దాన్ని చూస్తూ తనలో తాను నిత్యం పోరాట జ్వాలాకు గురౌతు, బ్రిటీష్ వలస పాలనను తుదిముట్టించడానికి కంకణబద్దుడై హిందూస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ ని స్థాపించి మిలిటెంట్ పోరాటాలు చేసిన గొప్ప దేశాభక్తి చరిత్ర కలిగిన మహనీయులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు అని కొనియాడారు. ఈ పోరాటంలో యువకులను, కార్మికులను, మహిళలను, విద్యార్థులను భాగస్వామ్యం చేయుట కొరకు నవ జవాన్ భారత్ సభను ఏర్పాటు చేసారన్నారు. తదనంతరం కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంఘంగా కూడ నడిపారన్నారు. ఈ ఉద్యమనికి కమ్యూనిస్ట్ లు తొడవ్వడంతో ఉద్యమం ఉదృత రూపంగా మారుతున్న సందర్భాన్ని గమనించిన బ్రిటీష్ పాలకులు అణిచివేయడానికి పబ్లిక్ సెప్టి బిల్ తీసుకురగా, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పొగ బాంబుతో తమ నిరసనను వ్యక్తం చేస్తూ గో బ్యాక్ బ్రిటీషర్స్, ఇoక్విలాబ్ జిందాబాద్.. అంటు నినాదలు చేయగా, బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిరసనను నిరంకుశంగా అణిచివేసి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను అరెస్టు చేసి 1931 మార్చ్ 23వ తేదీన ఉరి తీసి బ్రిటీష్ పాలకులు ఈ పాపాన్ని ముటకట్టుకున్నరన్నారు. నేటి యువత అలాంటి మహోన్నతమైన పోరాట స్ఫూర్తిని ఎత్తిపట్టి, వీరి పోరాట పటిమను నెమరేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు, యావత్తు భారతదేశ ప్రజానీకానికి వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలను తిప్పికొట్టి, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు కాంక్షించిన సమ సమాజ స్థాపనకై పోరాటాలు చేయాల్సిన బాధ్యత నేటి సమాజంపై ఉందన్నారు. కావున అలాంటి సమ సమాజ స్థాపనకై జరిగే పోరాటల్లో భాగస్వామ్యం కావాలని యువతకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి ఆసిఫ్, దిల్ సుఖ్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు నాగరాజు, సహాయ కార్యదర్శి గౌస్, కోశాధికారి మతిన్, లోకేష్, సభ్యులు సత్విక్, అఖిల, రమ, స్రవంతి రాజు, చిట్టీ తదితరులు పాల్గొన్నారు.