ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeనాగర్ కర్నూల్భక్తులకు మున్నూరు కాపు తాలూకా సంఘం వారిచే అన్నప్రసాద పంపిణీ

భక్తులకు మున్నూరు కాపు తాలూకా సంఘం వారిచే అన్నప్రసాద పంపిణీ

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ లోగల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో జరిగే శ్రీరామ నవమి కళ్యాణోత్సవం అనంతరం దర్శించుకున్న భక్తులందరికీ నాగర్ కర్నూల్ తాలూకా మున్నూరు కాపు సంఘం వారిచే అన్నప్రసాద పంపిణీ ఏర్పాటు చేసినట్లు సంఘం తాలూకా అధ్యక్షులు తీగల సుభాష్, కార్యదర్శి పాలమూరు సతీష్, కోశాధికారి తీగల జగదీష్ లు తెలిపారు. అధ్యక్షులు తీగల సుభాష్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా శ్రీరామ నవమి పురస్కరించుకొని టీటీడీ కల్యాణ మండపంలో భక్తులందరికీ అన్న ప్రసాదం పంపిణీ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 6వేల మందికి పైగా భక్తులకు సంపూర్ణ అన్నప్రసాద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు 9985221162, 9966671731 నంబర్ లలో సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!