ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయకాంత్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో వసతి గృహ సంక్షేమాధికారి రాధ ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. పెద్ద ముద్దునూరు వైద్యాధికారి డాక్టర్ వాణి విద్యార్థులను పరీక్షించారు. విద్యార్థులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు అందించారు. విద్యార్థునులకు ఆరోగ్యపరమైన సూచనలు చేసి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ శిబిరంలో మహిళా ఆరోగ్య కార్యకర్త జి.జే.కవిత, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ సాయిశ్రీ, ఆశ కార్యకర్తలు ఖంరున్నిసా, మానస, మహేశ్వరి, భాగ్యమ్మ, రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.