prathighatana.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 1:50 pm Digital Edition : PRATHI GHATANA

బార్ అసోసియేషన్ సమస్యలపై చిత్తశుద్ధితో కృషి చేయాలి 

ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

యాదాద్రి భువనగిరి జిల్లా బార్ అసోసియేషన్ లో పేరుకుపోయిన, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సభ్యులందరూ చిత్తశుద్ధితో ఐక్యంగా పని చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి కోరారు. నూతనంగా ఎన్నికైన భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట బార్ అసోసియేషన్ అధ్యక్షులకు, నూతనంగా ఎన్నికైన కమిటీలకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలు ప్రధానంగా సొంత భవనాలు లేక అద్దె భవనాల లో ఇరుకు భవనాలలో కోర్టులు నడవడంతో క్లైంట్లు అడ్వకేట్ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నూతన కోర్టు భవనాల సముదాయాలను పూర్తి చేసే విధంగా కమిటీలు తగిన పరిశీలన చేయాలని వారు అన్నారు. జిల్లాలో వివిధ కోర్టులలో ఉద్యోగుల పోస్టులను త్వరితగతిన భర్తీ కి కృషి చేయాలని, జిల్లాకు రావలసిన లేబర్, ఫ్యామిలీ, ఎస్సీ ఎస్టీ, జూ. ఎన్ఎల్, కోర్టులు వచ్చే విధంగా కృషి చేయాలని, వివిధ కోర్టులలో స్థానిక చిన్న చిన్న సమస్యలు పెండింగ్ లో ఉండడం ద్వారా క్లైంట్లకు, న్యాయవాదులకు ఇబ్బందులు, ఎదురవుతున్నయని వారు అన్నారు. వివిధ కోర్టులలో న్యాయమూర్తులు లేకపోవడంతో కేసులు పెండింగ్ లో ఉంటున్నాయని భర్తకి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా గౌరవ అధ్యక్షులు కుక్కదువ్వ సోమయ్య, అధ్యక్షులు బొల్లెపల్లి కుమార్, ఉపాధ్యక్షులు తడక మోహన్, పాల్వంచ జగతయ్య, ఎం.డి నేహాల్, సహాయ కార్యదర్శులు సీసా శ్రీనివాస్, సూదగాని శ్రీహరి, చింతల రాజశేఖర్ రెడ్డి కోశాధికారి బొడ్డు కిషన్ పాల్గొన్నారు.