
దుండగుల్ని అరెస్టు చేసె వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ
ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
కుమ్మెర సంఘటన లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగ ఎమ్మార్పీఎస్, ఎంఇఎఫ్, ఎంఎస్ఎఫ్, బీఎస్పీ, బహుజన టీచర్స్ సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ హాజరయ్యారు.ఈ సంఘటన ఉద్దేశించి మాట్లాడుతూ.. పాప చనిపోయి ఐదు రోజులు గడుస్తున్న గణేష్ కుటుంబం బజారున పడిన, నేటికీ సంఘటన చేసిన రెడ్డిలను అరెస్టు చేయకపోవడం శోచనీయకమన్నారు. చాకలి సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి మధ్యలో పుట్టిన ఆ పాపకు పేరు చిన్నారి ఐలమ్మగా అభివర్ణించాలని వారన్నారు. ఆ పాప బ్రతికే ఉంటే చంపిన రెడ్లకు మరణ శాసనం రాసేదని వారన్నారు. ఏ రాజకీయ జోక్యం లేకుండా రాజ్యాంగాన్ని గౌరవించి చట్టపరంగా కేసును దర్యాప్తు చేయడం జరిగితే, ఈ 8 మంది రెడ్లలో ఏ రెడ్డిని మినహాయించకుండా, ఏ రెడ్డిని వదిలి పెట్టకుండా వీరిపై నాన్ బెయిల బుల్ కేస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, మర్డర్ కేసులు పెట్టి నిష్పక్షపాతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ సంఘటనపై స్పందిస్తే రెడ్ల ముఖ్యమంత్రిగా కాకుండ, సామాజిక వర్గాల ముఖ్యమంత్రిగా నిలుస్తారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు టైగర్ జంగయ్య, ఎంఎస్పీ జిల్లా నాయకులు కరిగల దశరథం, ఎమ్మార్పీఎస్ నాయకులు గూట విజయ్, కోళ్ల శివ, బీఎస్పీ నాయకులు పోలేపల్లి రామచందర్, మాదిగ టీచర్స్ జానయ్య, గుడిపల్లి నిరంజన్, విష్ణు, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.
