prathighatana.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 5:46 pm Digital Edition : PRATHI GHATANA

ప్రేమ ఆప్యాయత వాత్సల్యానికి ప్రతిరూపం దోమల మల్లేష్ మాదిగ

దోమల మల్లేష్ మాదిగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ప్రేమ, ఆప్యాయత , వాత్సల్యానికి ప్రతిరూపం దోమల మల్లేష్ మాదిగ అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మధిర బీఆర్ఎస్ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి, ఎంఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి అన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ హైదరాబాద్ మొదటి అధ్యక్షులు, కాచిగూడ పూర్వ విద్యార్థి బహుజన రాజకీయ నాయకులు దోమల మల్లేష్ మాదిగ యాదిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రుద్రవరం లింగస్వామి అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మధిర బీఆర్ఎస్ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి హాజరై, కాచిగూడ హాస్టల్ పూర్వ విద్యార్థుల తో కలిసి మల్లేష్ మాదిగ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాదిగ యాదిలో కాచిగూడ హాస్టల్ పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. మాదిగ విద్యార్థులను ఏకం చేసి ఉద్యమాల్లో భాగస్వామ్యం చేశారని, ఎంతో మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టి, ఆర్థిక సహాయం చేశారని కొనియాడారు. ఆయన మన మధ్యలో లేడనే విషయం తలుచుకుంటేనే గుండె బరువెక్కిందని పలువురు పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

మాదిగలంతా ఏకం కావాలి.. రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలి

ఏప్రిల్ 5న మాదిగ మహా శక్తి పార్టీ జెండా ఆవిష్కరణ

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

మన రాష్ట్రంలో 75 శాతం మాదిగ ప్రజలు ఉన్నారన్నారు. మనందరం ఏకమైతే మనల్ని కాదని ఏ మగాడు గెలుస్తాడు, ఎంత మొనగాడైన విజయం సాధించలేరన్నారు. మన ఏకం కాకుండా ఇట్లానే ఉంటే మన మాదిగ బతుకులు మారవన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు, 4 గురు ఎంపీలు మాదిగలు మాత్రమే ఉన్నారన్నారు. కౌన్సిల్ లో రాజ్యసభలో, పార్లమెంట్ లో మాదిగ జాతిని అవమానపరిచే విధంగా ఏ ఒక్క మాదిగ బిడ్డ కూడా లేరన్నారు. అందుకే మాదిగ మహాశక్తి పార్టీ పెట్టి మాదిగల అందరిని ఏకం చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికలలో పోటీ చేసే సమయంలో తనను ఓడించడానికి రెడ్లు అందరూ ఏకమైన కూడా ప్రజలు ఏకమై తనను గెలిపించారన్నారు. రాజ్యాధికారంతో నే మన బతుకులు మారుతాయని తెలిపారు. ఏప్రిల్ 5 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాదిగ శక్తి జెండా ఆవిష్కరణ చేయబోతున్నాను అని తెలిపారు. మాదిగ బిడ్డలంతా విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.