ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవి కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతిఘటన బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్

భువనగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ హెచ్చరించారు. సోమవారం భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్ శివారులో సర్వే నెంబర్ 157లో ప్రభుత్వ భూమి ఇండోర్ స్టేడియంకు కేటాయించిన స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇండోర్ స్టేడియం స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం గురించి జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారితో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఎవరైన అక్రమంగా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాహసిల్దార్ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ కర్ణాకర్, నాయకులు హిరేకార్ శ్రీను, అధికారులు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!