ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో లట్టుపల్లి గ్రామానికి చెందిన పంతుల బాజీరావు మూడవ వర్ధంతి పురస్కరించుకొని కుటుంబ సభ్యులు పి. మల్లాజీ రజిని దంపతులు రోగి సహాయకులకు మంగళవారం సత్యసాయి అన్నప్రసాద పంపిణీ కేంద్రంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదానం చేయడంతో పూర్వీకులు సంతృప్తి చెందుతారని అన్నారు. గర్భవతులు, రోగి సహాయకులు, చిన్నారులు 250 పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద కేంద్రం బాధ్యులు ఏలీమే ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతిరోజు మధ్యాహ్నం12:30 నుంచి అన్న ప్రసాదం రోగి సహాయకులకు పంపిణీ చేస్తామని, ఎవరైనా పుట్టినరోజు, వివాహ దినోత్సవ, ఇతర కార్యాలు పురస్కరించుకొని అన్నదానం చేయదలచిన వారు నేరుగా లేదా 9441303182 నెంబర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంతుల భారతమ్మ, మనస్విని, సాత్విక, సత్యసాయి అన్నప్రసాద కార్యదర్శి ఎలిమేశ్వరయ్య, సాయి ప్రకాష్, బాలయ్య, పాండు, కృష్ణయ్య, బాలకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.