ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది సోమవారం సాధారణ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.రవికుమార్ నాయక్ పండ్ల పంపిణీ ప్రారంభించారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులు విద్యతో పాటు సేవాతత్వరత కలిగి ఉండడం మంచిదని అన్నారు. ఆస్పత్రిలోనీ పలు వార్డులలోని చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, ఆసుపత్రి నర్సింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
