*నాగర్ కర్నూల్ పూజారి బూర్గుల నరసింహారావు సేవా కార్యక్రమం*
ప్రతి ఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కు చెందిన బూర్గుల నరసింహారావు 2014 నుండి ప్రతి నెలలో ఒకరోజు రోగి సహాయకులకు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అన్న ప్రసాద పంపిణీ చేస్తున్నట్లు మంగళవారం ఆయన తెలిపారు. దత్త జయంతి, కార్తీక పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి ప్రత్యేక రోజులలో తప్పని సరిగా నెలలో ఏదైనా ఒక రోజు 150 మందికి రోగి సహాయకులకు అన్నప్రసాదం, స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈరోజు మాఘ అమావాస్య పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ నందకిషోర్,కవిత, అరుణ, సాయి ప్రకాష్, వెంకటయ్య, పద్మ, వెంకటేశ్వర రావు, గురునాథ్, హెల్ప్ డెస్క్ఇంచార్జ్ టి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.