ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

జల్పల్లి, పహాడీషరీఫ్, షాహీనగర్ డివిజన్ల లోని ప్రాంతాలలో మృతి చెందిన జంతువులు, వాటి వ్యర్థాలను గుర్తు తెలియని వ్యక్తులు వేయడంతో అవి కుళ్లి వాటి నుండి వచ్చే దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జల్పల్లి వాసులు, వాహనదారులు పేర్కొంటున్నారు. కార్గో రోడ్డులో, పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే దారిలో, జల్పల్లి కమాన్ రోడ్డులో, జల్పల్లి కమాన్ నుంచి కొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్ విద్యుత్ సబ్ స్టేషన్ దారి వద్ద ముస్తఫా కు వెళ్లే దారిలో మృతి చెందిన జంతు కళేబరాలు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డంప్ చేస్తున్నారని వాటి వ్యర్థాలను ఇతర ప్రాంతాల నుండి రాత్రి సమయాల్లో వేస్తున్నారు. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుండంతో పరిసర ప్రాంతాల వాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మంది స్థానికులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు . చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రహదారుల్లో వెళ్ళేవారు దుర్వాసన భరించలేక వాంతులు చేసుకుంటున్నారు. వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ముక్కు మూసుకునే సమయంలో అదుపు తప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా చీకట్లో జంతు వ్యర్థాలను ఈ ప్రాంతంలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. కోల్డ్ స్టోరేజీల నుండి తీసుకొచ్చి వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు మృతిచెందిన 40 గేదేలను, 50 పందులను, 10 ఆవులను, 5 గుర్రాలను ఈ రహదారులలో వేశారు. వీటితోపాటు దాదాపు 100 క్వింటాళ్ల జంతు వ్యర్థాలను మున్సిపాలిటీ అధికారులు జేసీబీ ద్వారా గుంత తీసి పూడ్చి వేయడం జరిగిందని అధికారలు తెలిపారు. ఈ ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేవనే ధైర్యంతోనే ఇతర ప్రాంతాల నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ జంతు వ్యర్థాలను పడవేస్తున్నారని జల్పల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

దుర్వాసనను తట్టు కోలేకపోతున్నాం
కార్గో రోడ్డులో, పహాడిషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే ప్రధాన రహదారులలో, జల్పల్లి కమాన్ రోడ్డులో, జల్పల్లి కమాన్ నుంచి కొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్ సబ్ స్టేషన్ వద్ద ముస్తఫా కు వెళ్లే దారిలో, షాహీన్ నగర్ నుంచి వెంకటాపూర్ వెళ్లే రహదారిలో మృతి చెందిన జంతు కళేబరాలు, చెత్తను పడేస్తున్నారు. ఈ రహదారుల్లో వెళ్ళాలంటే దుర్వాసనను తట్టు కోలేకపోతున్నాము. ఇతర ప్రాంతాల నుండి మృతి చెందిన జంతువులను తెచ్చి ఈ రహదారిలో వేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి సమయాల్లో జంతు వ్యర్థాలను వేయడంతో ఈ రహదారిలో వెళ్ళే ఇతర ప్రాంతాలవారు. జల్పల్లి, షాహినగర్, పహాడీషరీఫ్ డివిజన్ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జంతు వ్యర్థాలను వేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలి. మళ్లీ ఈ ప్రాంతాలలో జంతు వ్యర్ధాలను వేయకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఖాలెద్ అబ్దుల్ లతీఫ్, షాహినగర్ వాసి