ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ప్రజలల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విశ్వాసం నింపారు

ప్రజలల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విశ్వాసం నింపారు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

తెలంగాణ ప్రజలలో భారతీయ జనతా పార్టీ పైన మంత్రి బండి సంజయ్ కుమార్ విశ్వాసం నింపారని బీజేపీ రంగారెడ్డి జిల్లా రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయం నాంపల్లిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరీంనగర్ లో తెలంగాణ మొదటి మేయర్ ను గెలిపించి, అలాగే భారీ సంఖ్యలో కౌన్సిలర్స్ ను గెలిపించి తెలంగాణ ప్రజలలో బీజేపీ పై విశ్వాసం నింపిన సందర్భంగా మంత్రి బండి సంజయ్ కి శాలువా కప్పి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాబోవు కాలములో తెలంగాణ లోని గ్రేటర్ హైదరాబాద్ , అలాగే ఎంపీటీసీ, జట్పీటీసీ లకు జరిగే ఎన్నికలలో బీజేపీ గెలుపే ధ్యేయం గా ప్రతి కార్యకర్త, నాయకులు సైనికులుగా సమన్వయం తో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో బీజేపీ నాయకులు మాదన్న, నర్సింగ రావ్, జయసూర్య, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‎

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!