ఏమాత్రం నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర నాయకులు కొలను శంకర్ రెడ్డి ఆగ్రహం
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మూసి ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లను కూలుస్తున్నారని బీజేపీ నాయకుడు సింగిల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్ పేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా ప్రకటించి భాగ్యనగర్ హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి చెందుతుందని మూడు కార్పొరేషన్లు అభివృద్ధికి నోచుకోలేదని మహానగరంలో విలీనం చేయడం అంటే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగర్ హిందువుల మనోభావాలను కాపాడాలని ఈ కార్పొరేషన్ లో ఏర్పాటును పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. మూడు కార్పొరేషన్లను విలీనం చేయడంతో రంగారెడ్డి జిల్లా పేరు ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. దీనిపై ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల హామీలు ఏమైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలను ఆకర్షితులను చేసి అధికారాన్ని అప్పజెప్పితే ఆరు గ్యారెంటీలకు అతీగతీ లేకుండా పోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ మరింత అవినీతికి పాల్పడుతూ మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకు తహతహలాడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గాలి మాటలు చెబుతున్న కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడే రోజు వచ్చిందని వేలాదిమంది ప్రజల ఇండ్లను కూల్చడంతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన ప్రవర్తనను ఇలాగే కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు మూసి ప్రక్షాళన కాలేశ్వరం మిషన్ భగీరథ పేరుతో చేసిన అవినీతిపై బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని భారత రాష్ట్ర సమితి కి గతంలో అసెంబ్లీ లో మెజార్టీ రాకుండా పార్లమెంటులో ఒక్క సీటు గెలవకుండా బుద్ధి చెప్పినా ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని, ఆ పార్టీ కోవలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గతంలో జరిగిన సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలే అందుకు ఉదాహరణ అన్నారు. ఆ ఎన్నికలలో వెయ్యికి పైగా సర్పంచ్ అభ్యర్థులు ఎన్నిక అయ్యారని తెలిపారు. 2వేల మంది ఉపసర్పంచ్ లు, 12 వేల మంది వార్డ్ మెంబర్లు, 20 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు గెలుచుకున్నాయన్నారు. కానీ దొడ్డి దారిన మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం వేసుకుంది అన్నారు. ఒక కరీంనగర్ చైర్మన్ గా బిజెపి పార్టీ సొంతమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.