ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు గాలికి

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు గాలికి

📰 Generate e-Paper Clip

ఏమాత్రం నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ నేతల ఆగ్రహం

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మూసి ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లను కూలుస్తున్నారని బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ కో- కన్వీనర్ కోటి ధర్మతేజ, బహదూర్ పుర అసెంబ్లీ కంటెస్టెంట్ అభ్యర్థి వై నరేష్, బహదూర్ పుర అసెంబ్లీ కన్వీనర్ ప్రశాంత్, శాలిబండ డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్, దూద్ బౌలి అధ్యక్షుడు నరేష్, కిషన్ బాగ్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ లు ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహదూర్ పుర, బండ్లగూడ తహసిల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా ప్రకటించి భాగ్యనగర్ హిందువుల మనో భావాలను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి చెందుతుందని మూడు కార్పొరేషన్లు అభివృద్ధికి నోచుకోలేవని.. మహానగరంలో విలీనం చేయడం అంటే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగర్ హిందువుల మనోభావాలను కాపాడాలని ఈ కార్పొరేషన్లో ఏర్పాటును పునః పరిశీలించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మూడు కార్పొరేషన్లను విలీనం చేయడంతో రంగారెడ్డి జిల్లా పేరు ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు, దీనిపై ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల హామీలు ఏమైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలను ఆకర్షితులను చేసి అధికారాన్ని అప్పజెప్పితే ఆరు గ్యారెంటీలకు అతీగతీ లేకుండా పోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ మరింత అవినీతికి పాల్పడుతూ మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకు తహతహలాడుతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గాలి మాటలు చెబుతున్న కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడే రోజు వచ్చిందని, వేలాది మంది ప్రజల ఇండ్లను కూల్చడంతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన ప్రవర్తనను ఇలాగే కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ మూసి ప్రక్షాళన, బీఆర్ఎస్ కాలేశ్వరం మిషన్ భగీరథ పేరుతో చేసిన అవినీతిపై బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. భారత రాష్ట్ర సమితి కి గతంలో అసెంబ్లీ లో మెజార్టీ రాకుండా పార్లమెంటులో ఒక్క సీటు గెలవకుండా బుద్ధి చెప్పినా ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని, ఆ పార్టీ కోవలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గతంలో జరిగిన సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఆ ఎన్నికలలో వెయ్యికి పైగా సర్పంచ్ అభ్యర్థులు ఎన్నిక అయ్యారు అన్నారు. 2వేల మంది ఉపసర్పంచ్ లు, 12 వేల మంది వార్డ్ మెంబర్లు, 20 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు గెలుచుకున్నాయన్నారు. కానీ దొడ్డి దారిన మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం వేసుకుంది అన్నారు. కరీంనగర్ చైర్మన్ సీటు బీజేపీ పార్టీ సొంతం చేసుకుంది అని తెలిపారు. భవిష్యత్తులో అస్త్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాదిరి చంద్రశేఖర్, ఏ. శ్రీహరి, పీ. చలపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!