రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
ప్రజాకవి జయరాజు విజ్ఞాన దర్శిని వ్యవస్థాప అధ్యక్షులు రమేష్ పిలుపు

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
వైజ్ఞానిక దృక్పథంతోనే మానవ ప్రగతి సాధ్యమని ప్రముఖ ప్రజాకవి డాక్టర్ జయరాజు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ తెలియజేసినారు. గురువారం ప్రకృతి రక్షించుకుందాం మనే నినాదంతో విజ్ఞాన దర్శిని, నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రకృతి విజ్ఞాన యాత్ర భువనగిరి జిల్లా కేంద్రానికి రాగానే వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, అభ్యుదయవాదులు, రచయితలు, అంబేద్కర్ వాదులు, ప్రకృతి ప్రేమికులు స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి జయరాజు, రమేష్ మాట్లాడుతూ.. సమాజ మనుగడలో ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈరోజు రోజురోజుకు ప్రకృతి మొత్తం కూడా ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మానవుని యొక్క అభివృద్ధిలో కీలకపాత్ర సైన్స్ పోషిస్తుందని తెలియజేశారు. యువతి యువకులు శాస్త్రీయ పరమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరారు. ప్రకృతిని కాపాడుకొని వైజ్ఞానిక దృక్పథం పెంపొందించు కోవాలని పిలుపునిచ్చారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మానవునికి స్వేచ్ఛగా జీవించే హక్కు, భూమి, పకృతి , సంపద కుందే హక్కును రాజ్యాంగాన్ని కల్పించిందని అన్నారు. ఈరోజు పాలకులు ప్రజలను మభ్య పెట్టడానికి పెట్టడానికి మూఢత్వాలను ముందుకు తెస్తున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముక్కెర్ల యాదయ్య అధ్యక్షత వహించగా వివిధ ప్రజా సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య, బర్రె సుదర్శన్, సామ మల్లారెడ్డి, శ్రీనివాస చారి, జిట్ట భాస్కర్ రెడ్డి, కొడారి వెంకటేష్, భాస్కర్ నాయక్, రాజేష్ నాయక్, కొండమడుగు నరసింహ, మాటూరు బాలరాజు, దాసరి పాండు, మాయ కృష్ణ, లావుడియా రాజు, బొల్లు యాదగిరి, గడ్డం వెంకటేష్, ఈర్ల పల్లి ముత్యాలు, వనం ఉపేందర్, గంధమల్ల మాతయ్య, సీహెచ్. లక్ష్మి, కొండమడుగు నాగమణి, రాహుల్, బాలయ్య, మల్లేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.