prathighatana.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 1:49 pm Digital Edition : PRATHI GHATANA

పేదల కష్టాలు తెలిసిన మాజీ సీఎం కేసీఆర్ – పేదింటి ఆడబిడ్డలకు మేనమామ లాగా అండగా ఉన్నారు – మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య

పేదల కష్టాలు తెలిసిన మాజీ సీఎం కేసీఆర్ అని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామ లాగా అండగా ఉన్నారని మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్ పల్లి సర్కిల్ ప్రీమియర్ ఫంక్షన్ హాల్ లో 360 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చెక్కులు తీసుకున్న ప్రతి లబ్ధిదారులు తులం బంగారం గురించి, హామీలు గురించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పేదల అవసరాలు, కష్టాలను గుర్తించిన మాజీ సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తీర్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి- షాదీముబారక్‌ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పేదల ఇళ్ళును కూల్చటమే ప్రథమ కర్తవ్యంగా పాలన సాగిస్తూ ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చిన హామీల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు “తులం బంగారం” హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క మహిళకైనా ఆ హామీ అందలేదని అన్నారు. అదేవిధంగా నిరుపేదలకు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించకుండా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,.. కేసీఆర్ పాలనలో కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో పారదర్శకత పాటించాలని ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి కేటాయించాలని కోరారు. అదేవిధంగా నీటి సమస్య తీవ్రంగా ఉందని, కేసీఆర్ పాలనలో మహిళలు బిందెలతో బయటకు పోకుండా మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చి ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని.. దాన్ని తూట్లు పొడుస్తూ వారానికి ఒక్కసారి కూడా మంచినీటిని వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్యలను తీర్చాలని వేసవిలో ప్రజలకు నీటి ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రోజు వదలాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఇందిరా దేవి, జల్ పల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావ్, మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, మాజీ కో – ఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు షేక్ అప్జల్, పల్లపు శంకర్, శంషుద్దీన్, సోషల్ మీడియా వారియర్ వాసు బాబు, నాయకులు ఖైసర్ బామ్, యంజాల జనార్ధన్, కొంగరి సుభాష్, యంజాల అర్జున్ , సైయూద్ పటేల్, బర్కత్ అలీ ,ఆరిఫ్ అలీ, మారుతీ, గుండు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.