prathighatana.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 4:12 pm Digital Edition : PRATHI GHATANA

పూల్ బాగ్ చమన్ సమీపంలో చలివేంద్రం ప్రారంభం

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో

వేసవి వేడి తీవ్రత పెరగడంతో నగరంలోని ప్రజలకు కూడా ఇబ్బందులు పెరిగాయి. లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన గంగం సతీష్ , ఎన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు పూల్ బాగ్ చమన్ సమీపంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా నార్కెట్ పల్లి శైలేష్ కుమార్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలు ప్రభుత్వ, స్వచ్ఛంద, ప్రజల భాగస్వామ్యంతో శాశ్వతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సతీష్, కాపర్తి శ్రీనివాస్, వడ్డేపల్లి రాజు, ఠాకూర్ రాకెష్ సింగ్, శ్రీరాములు, ఎన్ మహేష్ కుమార్, జిల్లా రాఘవేందర్, వరలక్ష్మి, నర్సింగ్ రావు, అనురాధ, అంజలి, అడ్వకేట్ కనకరాజు, సిద్ధేశ్వర్ చారి, కృష్ణ, లక్ష్మణ్, కుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.