ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిపారిశుద్ధ్య కార్మికులు బాగుంటేనే.. మనందరం బాగుంటాం

పారిశుద్ధ్య కార్మికులు బాగుంటేనే.. మనందరం బాగుంటాం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య

పారిశుద్ధ్య కార్మికులు బాగుంటేనే మనందరం బాగుంటామనీ బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెల్డండి సమ్మయ్య అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్, బడంగ్ పేట్ సర్కిల్ – 16 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్నటు వంటి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో భాగంగ బడంగ్ పేట్ సర్కిల్ –16 డిప్యూటి కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో వైద్యులు కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, షుగర్, హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం సిబ్బందికి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రతినిత్యం ప్రతి కాలనీలో బస్తీలలో చెత్తా చెదారం లేకుండా, మురుగు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం ముఖ్యమని తెలిపారు. వారు బాగుంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏం హెచ్ వో డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ డబ్ల్యూ ఏం డి ఈ.ఈ అభినయ్ కుమార్ , ఎ.ఇ గంగా ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ బాలామణి, వెటర్నరీ డాక్టర్ రవి చంద్ర, వైద్య బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!