ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్పరిసరాల పరిశుభ్రత వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి

పరిసరాల పరిశుభ్రత వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయని జీహెచ్ఎంసీ పహడీషరీఫ్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు షేక్ అఫ్జల్ అన్నారు. రంజాన్ మాసాల సందర్భంగా స్వచ్ఛత ఉండాలని డివిజన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులతో చెత్తాచెదారం లేకుండా క్లీన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయవద్దని సూచించారు. నిత్యావసర వస్తువులు విక్రయించే సమయంలో ఇంటి నుంచే సంచులను తీసుకుని వెళ్లాలని, ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించవద్దని తెలిపారు. పారిశుధ్య విభాగం సిబ్బంది రోజు వారి పనులను కొనసాగిస్తూనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి బస్తీలు పబ్లిక్‌ టాయిలెట్లు, ఖాళీ ప్రదేశాలు, వారాంతపు సంతలు తదితర ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ మోయిన్ బాబా, సూపర్వైజర్ బుడుమాల కుమార్ , పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!