ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మన ఇంటి తోపాటు పరిసరాల పరిశుభ్రతతో నిత్యం ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని, పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అంటు వ్యాధులను నిరోధించి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని నిత్యం వార్తాపత్రికలు చెబుతున్నాయి. అదేవిధంగా జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పర్యావరణ పరిరక్షకులు, మున్సిపల్ అధికారులు, సోషల్ వర్కర్లు, సమాజంపై ప్రేమ ఉండే వాళ్లు చెప్తుంటారు. ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేయడం, చేతులు తరచుగా కడుక్కోవడం, డ్రై డే పాటించడం ద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇళ్లు, పరిసరాలలో రహదారులలో ఇరువైపులా చెత్త వేయకుండా చెత్తను మునిసిపల్ సంబంధించిన ఆటోలో సేకరణ సమయంలో వేయాలని నోరు నొచ్చే విధంగా చెప్తుంటారు. తద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని అవగాహన కలిగిస్తుంటారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకోవాలని నొక్కి మరీ చెప్తుంటారు. ఎంత చెప్పినా ప్రజల్లో మార్పు రాదా ? పర్యావరణపై అవగాహన ఉన్నవాళ్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాట్లు నేర్పిస్తే జీవితాంతం అదే బాటలో పయనిస్తారని రాబోయేతరం పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా తమ తమ ఇండ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా, మట్టిని, గాలిని, నీటిని సంరక్షించుకొనే విధంగా వారికి నేర్పాలి.
వినూత్నంగా పర్యావరణం, గంజాయి , డ్రగ్స్ , సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమ్స్ పై అవగాహన
బాలాపూర్ మండలం జల్పల్లి డివిజన్ళ పరిధిలోని శ్రీరామ కాలనీ ప్రాంతానికి చెందిన మన ఊరు న్యూస్ సీఈవో లక్ష్మణ్ కుమార్ పర్యావరణం, గంజాయి , డ్రగ్స్ , సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమ్స్ పై అవగాహన కోసం రూ. 20,000 వేలు సొంతంగా ఖర్చు పెట్టుకుని 10 బ్యానర్లు ఆయా కాలనీ, బస్తీలలో ఏర్పాటు చేయించారు. వాటిపై తెలుగు ,హిందీ భాషలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదు, యువత మద్యానికి బానిస కావొద్దు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడవద్దు. శ్రీరామ కాలనీ, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుదాం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అలవాటు మార్చుకోవాలని పల్లెటూరు నుంచి పట్నంగా మారి రోజురోజుకు మన శ్రీరామ కాలనీ అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో అందంగా మర్చుకుందామని, మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకుందాం అనే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించారు. 50% ప్రజల్లో అవగాహన వచ్చి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ అధికారులకు కేటాయించిన స్థలాలలో మాత్రమే వేస్తున్నారు. మరో 50% మంది అధికారులు కేటాయించిన స్థలాల్లో కాకుండా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, అవగాహన చేస్తున్న బ్యానర్ల ముందే చెత్తను వేయడం ఎంతవరకు సమంజసం. సోషల్ మీడియాకు ఒక సీఈవో అయిండి సోషల్ వర్కర్ గా సమాజాన్ని మార్పు చేద్దామని ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వస్తే ఇంకా కాలనీ, బస్తీలలో అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉంది. చెత్తా చెదారం పేరుకొని పోయి దాంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి, ప్రాణాలకు ముప్పు కలుగుతుందని, ప్రజలు ఇబ్బందులు పడతారని అవగాహన కలిగిస్తుంటే ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నారు అనేది పలువురు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించే బ్యానర్ ముందే చెత్త వేస్తే వేసే వారిని ఏమనాలి. మరి అక్కడ ప్రాథమిక పాఠశాల ఉండడం, పాఠశాల సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గాని పట్టించుకోకపోవడం ఇంకా విడ్డూరంగా ఉంది. పాఠశాలకు వచ్చే విద్యార్థులు కూడా అనారోగ్యాల బారిన పడతారని అక్కడ చెత్త వేస్తున్న వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన చేపట్టాలి ప్రజల్లో మార్పు తేవాలి ఒకరితో మొదలైన మార్పు వందల మంది, వేల మందిలో మార్పు రావాలని పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు. మరొకసారి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నారు.
