prathighatana.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 9:07 am Digital Edition : PRATHI GHATANA

పదవి లేకున్నా.. అనవసర పెత్తనం..!

ఎల్బీనగర్ లో తాజా మాజీల హల్ చల్

అధికారులపై ఒత్తిడి.. సమాంతర పాలన

ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు గత నెల ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసింది. నెల రోజులు గడిచిపోయినా ఎల్బీనగర్ మాజీ కార్పొరేటరల తీరులో మాత్రం మార్పులేదు. తాము ఇంకా కార్పొరేటర్లుగా కొనసాగుతున్నాము అన్నట్లు వారి వ్యవహరి వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది. ఎల్బీనగర్ లో తాజా మాజీ కార్పొరేటర్లు చేస్తున్న హడావిడి చూసి స్థానిక ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.

మాజీలు అయినా..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో 150 డివిజన్ లు ఉండేవి. అయితే వాళ్ల పదవీ కాలం గత నెల ఫిబ్రవరి 10 వ తేదీతో ముగిసిపోయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలనంత స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్ పర్యవేక్షణలోకి వెళ్ళింది. కానీ ఎల్బీనగర్ పరిధిలోని అనేక డివిజన్ లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పదవి పోయిన తాము ఇంకా అధికారం తమ చేతుల్లోనే ఉన్నట్లుగా ఎల్బీనగర్ కార్పోరేటర్లు వ్యవహరిస్తుండడం ఇప్పుడు సర్వత్ర నగరంలో చర్చనీయాంశంగా మారింది.

అభివృద్ధి పనుల వద్ద పెత్తనం..!

ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో తాజా మాజీ కార్పొరేటర్ లు జోక్యం చేసుకుంటున్నారు. రోడ్ల నిర్మాణం డ్రైనేజీ పనులు జరుగుతున్న చోట బీరు తమ అనుచరులతో కలిసి ప్రత్యక్షమవుతున్నారు. అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టర్లను వర్కిఇన్స్పెక్టర్లను ప్రశ్నిస్తూ.. తామే ఆ పనులు మంజూరు చేయించినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. తనిఖీ చేసే అధికారం ప్రోటోకాల్ ప్రకారం తాజా మాజీలకు లేకపోయినప్పటికీ స్థానిక ప్రజల మెప్పు కోసం హల్ చల్ చేస్తున్నారు. పదవిలో లేని వ్యక్తులు ప్రభుత్వ పనులలో జోక్యం చేసుకునే అధికారం లేకపోయినా క్షేత్రస్థాయిలో వారు చేస్తున్న హడావిడి అధికారులకు తలనొప్పిగా మారింది.

మాజీలు అయినా అధికారులతో పోటీపడి.. సమాంతర పాలన..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ పరిధిలో తాజా మాజీ కార్పొరేటర్ లు అధికారులపై పెత్తనం చెలాయిస్తూ ఇంకా.. తాము పదవిలో ఉన్నట్టు అధికారులను బేధింపులకు గురి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కార్పొరేటర్ల పదవి కాలం ముగిసిన తర్వాత వాళ్ల పదవి నుండి వైదొలగాలి. ప్రస్తుతం బల్దియా పాలనంత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అధికారులు నేరుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. కానీ ఎల్బీనగర్ లోని కొందరు అధికారులు మాజీ కార్పొరేటర్ లకు పాత పరిచయాల వల్లనో, రాజకీయ భయం వల్లనో.. తాజా మాజీలకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో మాజీ కార్పొరేటర్ లు అధికారిక సమీక్షా సమావేశాలలో జోక్యం చేసుకుంటూ, బస్తీలలో తనిఖీలు చేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి చేస్తూ ఒక రకమైన సమాంతర పాలన కనిపిస్తోందని, దీనివల్ల అధికార యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేయలేక పోతుందని విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.

రాజకీయ ఉనికి కోసం ఆరాటం..

తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు.. రాబోయే ఎన్నికల్లో తమ టికెట్ సుస్థిరం చేసుకోవాలనే ఆరాటంతోనే తాజా మాజీ కార్పొరేటర్ లు ఇలా చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో తమ ఉనికి కోల్పోకూడదని ఉద్దేశంతో చిన్న సమస్య పరిష్కారం అయినా.. తమ వల్లే జరిగిందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో జరిగే పనులను తమ సొంత విజయాలుగా చిత్రీకరించుకోవడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.