ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణపచ్చల కట్ట సోమేశ్వరాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

📰 Generate e-Paper Clip

పంచాంగ శ్రవణం

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

భువనగిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరిపించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, వార్డు కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్ నాకోటి నాగు, చల్లగురువుల రఘుబాబు, ఆలయ మాజీ చైర్మన్ దేవరకొండ నరసింహ చారి, గ్యాస్ చిన్నా, బర్రె నరేష్ తదితరులు పాల్గొనగా ఆలయ చైర్మన్ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!